: ఆ లక్షణాలు టీఆర్ఎస్ పార్టీ రక్తంలోనే ఉన్నాయి: జైపాల్ రెడ్డి
మోసం, దగా అనేవి టీఆర్ఎస్ పార్టీ రక్తంలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్ లో ఈరోజు కాంగ్రెస్ రైతు గర్జన సదస్సు నిర్వహించారు. రుణమాఫీ అమలు చేయాలంటూ దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించారు.ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, రూ.70 వేల కోట్లు అప్పులు చేసి వాటిని కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని ఆరోపించారు. అనంతరం పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ, అరాచకంగా మారిన టీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.