: మొదట్లోనే కీలక వికెట్ కోల్పోయిన భారత్
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మొదట్లోనే కీలక వికెట్ కోల్పోయింది. 243 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా స్కోరు 21 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుటయ్యాడు. ఆఫ్ స్టంఫ్ కి దూరంగా వెళ్తున్న బంతిని కొట్టబోయి రోహిత్ శర్మ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. 27 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు.