: సరిహద్దు దాటి వచ్చిన ‘పాక్’ డేగ
పాక్ సరిహద్దులు దాటి భారత్ లోకి ఒక డేగ ప్రవేశించి కలకలం సృష్టించింది. రాజస్థాన్ లోని అనూప్ గఢ్ లో సరిహద్దు భద్రతా సిబ్బంది ఒక ట్యాగ్ తో ఉన్న ఈ డేగను పట్టుకున్నారు. ఈ డేగను అటవీ శాఖాధికారులకు అప్పగించామని సరిహద్దు భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. కాగా, భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పావురం, బెలూన్లు, ఆపిల్స్ వంటివి సరిహద్దులు దాటి వచ్చిన సంగతి విదితమే. తాజాగా, ఈ డేగ రావడం చర్చనీయాంశమైంది.