: ఆలయంలో వివాహం చేసుకునేందుకు వచ్చిన ప్రేమజంట.. యువతి తరఫు బంధువుల దాడి.. ప్రియుడి మృతి
ఆలయంలో వివాహం చేసుకునేందుకు వచ్చిన ఓ ప్రేమజంటపై సదరు యువతి తరఫు బంధువులు దాడిచేయడంతో ప్రియుడు మృతి చెందిన దారుణ ఘటన ఈ రోజు కరీంనగర్ ఎల్‌ఎండీ కాలనీలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రేమ జంట తమ పెళ్లికి అన్నింటినీ సిద్ధం చేసుకొని వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న యువతి బంధువులు ఆగ్రహంతో కత్తులు చేతపట్టుకొని వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దాడికి దిగారు. దాడిలో తీవ్రగాయాలతో ప్రియుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తరువాత యువతిని ఆమె బంధువులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రాణాలు కోల్పోయిన యువకుడిని కరీంనగర్ విజయపురికి చెందిన అనిల్‌గా గుర్తించారు.