: చంద్రబాబు సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి అరెస్ట్!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో పర్యటిస్తూ, పెట్రోల్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన వేళ, అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వెళ్లిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని చంద్రబాబు సమక్షంలోనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సభా వేదిక పైకి వెళ్లేందుకు గండి బాబ్జి ప్రయత్నించిన సమయంలో మరో టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వర్గం ఆయన్ను అడ్డుకోవడంతో వాగ్వాదం, గొడవ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలు, నేతలు బాహాబాహీకి దిగగా, సీఎం ఉన్న వేదిక కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు బాబ్జీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం వెలువడాల్సివుంది.