: బంగారు తెలంగాణ కాదు.. కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది: ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి


తెలంగాణలో రైతు స‌మ‌స్య‌ల‌పై పోరులో భాగంగా తాము నెల రోజులు గ్రామాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల నుంచి సంత‌కాలు సేక‌రిస్తామ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా మానుకోటలో నిర్వ‌హిస్తోన్న‌ రైతు గర్జన సభలో ఆయ‌న మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్ మెంటు, ఉపాధి హామీ, రైతు రుణ‌మాఫీ ఇలా ఏ విష‌యాన్ని తీసుకున్నా కేసీఆర్ ప్ర‌భుత్వం అన్నింటిలోనూ అన్యాయ‌మే చేసింద‌ని ఆయ‌న అన్నారు. ‘బంగారు తెలంగాణ కాదు.. కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. రైతులకు మేలు చేయడానికి కాంగ్రెస్ ముందుకు వస్తోంది. ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోని రైతుల వద్దకు వెళతాం. రైతుల కోసం దరఖాస్తుల సేకరణ చేస్తాం. నెల రోజుల్లో పూర్తి చేస్తాం. అనంత‌రం తెలంగాణ‌లో ఏర్పాటు చేయ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌లో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌సంగిస్తారు. త‌రువాత సంత‌కాల సేక‌ర‌ణ‌ను రాష్ట్ర‌ప‌తికి పంపిస్తాం’ అని ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News