: పోలీస్ స్టేషన్‌లోనే దీక్షకు దిగిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు
అనంతపురం ఎన్‌పీ కుంటలోని ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్‌ను పరిశీలించడానికి బయలుదేరిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఆందోళన చేసిన పలువురు సీపీఎం నేతలను కూడా అరెస్టు చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాఘవులు పోలీస్‌స్టేషన్‌లోనే దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో సీపీఎం కార్యకర్తలు ఆందోళకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జి జరపాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లాఠీ ఛార్జీలో ముగ్గురు సీపీఎం నేతలకు గాయాలయ్యాయి.