: తన వారసుడు ఎవరో తేల్చి చెప్పిన కరుణానిధి!
తన రాజకీయ వారసుడు ఎవరో డీఎంకే అధినేత కరుణానిధి తేల్చేశారు. తన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేది స్టాలిన్ (63) అని ప్రకటించారు. తన పెద్ద కొడుకు అళగిరి (65) ఏం న్యూసెన్స్ చేస్తాడో అనే సందేహంతో, తన రాజకీయ వారసుడి పేరును ప్రకటించడానికి కరుణ ఇన్నాళ్లు ఆగారు. 93 ఏళ్ల వయసులో ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు. పార్టీని పటిష్టపరిచేందుకు స్టాలిన్ ఎంతో కష్టపడ్డాడని ఈ సందర్భంగా కరుణానిధి కితాబిచ్చారు. మరోవైపు, దక్షిణ తమిళనాడులో గట్టి పట్టు ఉన్న కరుణ పెద్ద కుమారుడు అళగిరి... తన తండ్రి ప్రకటనతో ఏం చేయబోతారో అనే దానిపై డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.