: యూపీలో కాంగ్రెస్ కి షాక్.. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ కీలక మహిళా నేత రీటా బహుగుణ జోషి
భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో యూపీ కాంగ్రెస్ కీలక మహిళా నేత రీటా బహుగుణ జోషి బీజేపీ కండువా కప్పుకున్నారు. అమిత్ షా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రీటా బహుగుణ మాట్లాడుతూ.. 24 ఏళ్లు కాంగ్రెస్‌లో సేవలందించానని అన్నారు. దేశ ప్రయోజనాల కోసమే తాను బీజేపీలో చేరినట్లు వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన ఆమెను ఇటీవలే అమిత్షా కలిసినట్లు వార్తలు వచ్చాయి. యూపీలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే యూపీ పీసీసీ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.