: మధుమోహన్ రెడ్డితో నేనెప్పుడూ మాట్లాడలేదు: సూరి భార్య గంగుల భానుమతి
బెంగళూరులో మద్దెలచెరువు సూరి అనుచరుడు మధుమోమన్ రెడ్డిని కొందరు వ్యక్తులు చితకబాది, ఆ వీడియోను మీడియాకు లీక్ చేశారు. దీనిపై మద్దెలచెరువు సూరి భార్య గంగుల భానుమతి స్పందించారు. వాస్తవానికి సూరికి మధు అనుచరుడు కాదని ఆమె అన్నారు. సూరి పేరు చెప్పుకుని అతను భూదందాలు చేస్తున్నాడని ఆరోపించారు. చిన్న వ్యాపారం చేసుకునే మధు భూదందాలతో ఈ స్థాయికి ఎదిగాడని అన్నారు. తానెప్పుడూ మధుతో మాట్లాడలేదని చెప్పారు. మధులాంటి వ్యక్తులకు కచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని అన్నారు.