: బిల్డర్ తో డీల్... కోట్లు విలువైన ఆస్తులు రాయించుకున్న మధుమోహన్ రెడ్డి
మద్దెలచెరువు సూరి అనుచరుడు మధుమోహన్ రెడ్డిని బెంగళూరులో బట్టలు ఊడదీసి చితకబాదిన ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. దీని వెనుక బెంగళూరు డాన్ హెబెట్టు మంజు హస్తం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, దీనికి సంబంధించి తాజాగా మరో కథనం వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఐశ్వర్య బిల్డర్స్ అధినేత భాస్కర్ రెడ్డికి రూ. 50 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. ఈ క్రమంలో, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఆయనకు వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో, వారి నుంచి తనను కాపాడాలని మధుమోహన్ రెడ్డిని భాస్కర్ రెడ్డి ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో, అప్పుల వారి నుంచి కాపాడతానని అభయం ఇచ్చిన మధు... భాస్కర్ రెడ్డి ఆస్తులను తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా, కొందరు ప్రైవేట్ వ్యక్తులు మధుమోహన్ రెడ్డిని కిడ్నాప్ చేసి, చితకబాదారు. అప్పులు ఇచ్చిన వారికి చెందిన వ్యక్తులే మధుని చితగ్గొట్టిన్నట్టు తెలుస్తోంది.