: ఢిల్లీ వన్డే అప్‌డేట్స్: వంద మార్కును దాటిన న్యూజిలాండ్ స్కోరు.. కానె విలియమ్సన్ హాఫ్ సెంచరీ
భారత్- న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కొనసాగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ స్కోరు వంద మార్కును దాటింది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. భారత బౌలర్ ఉమేష్ విసిరిన బంతికి పరుగులేమీ చేయకుండానే గుప్తిల్ వెనుదిరిగిన అనంతరం క్రీజులో అడుగుపెట్టిన కానె విలియమ్సన్ అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజులో లాథమ్ 46 పరుగులతో, కానె 66 పరుగులతో ఉన్నారు. న్యూజిలాండ్ స్కోర్ ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు (20 ఓవర్లలో)గా ఉంది.