: అంత చిన్న విషయానికి ఇంత దిగులా?: ఉదయభానుతో వివాదంపై గాయని సునీత వివరణ
ఇటీవల ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, గాయని సునీత పేరు చెప్పకుండానే ఆమెపై ఉదయభాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమెరికా టూర్ కు వెళ్లిన తనను ఓ గాయని అవమానించిందని, స్టేజ్ మీదకు ఆహ్వానించలేదు సరికదా, తనంతట తానే వెళుతుంటే, విషాద సంగీతాన్ని వినిపించారని, తనకు ఏడుపు వచ్చిందని ఉదయభాను వ్యాఖ్యానించగా, ఆ ఇంటర్వ్యూను చదివిన గాయని సునీత వివరణ ఇచ్చింది. "నా పేరు చెప్పకపోయినా, ఆ వ్యాఖ్యలు నా గురించే అని తెలిసింది. ఉదయభాను నన్ను అపార్థం చేసుకుంది. చిన్న ఘటనను మనసులో పెట్టుకుని దిగులు పడుతోంది. ఆ షో తరువాత నేను చాలా సార్లు ఉదయభానును కలిసినా నాతో మాట్లాడలేదు. ఇప్పుడు అర్థమైంది, ఉదయభాను కోపానికి కారణమేంటో. వాస్తవానికి యూఎస్ ప్రోగ్రామ్ నాది. దానికి రావాలని నేనేమీ ఉదయభానును పిలవలేదు. నిర్వాహకులు పిలిస్తే వచ్చిన భానును నేనెందుకు వేదికపైకి పిలుస్తాను? ఇక విషాద సంగీతం విషయం నాకు గుర్తు లేదు" అని చెప్పుకొచ్చింది సునీత.