: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... క్రీజులోకి వచ్చిన వెంటనే వెనుదిరిగిన గుప్తిల్


భార‌త్‌లో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ప‌ర్య‌ట‌నలో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రెండో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్డింగ్‌కే మొగ్గు చూపింది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఫిరోజ్ షా కోట్ల మైదానంలో టీమిండియా ముందుగా ఫీల్డింగ్ తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. క్రీజులో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గుప్తిల్, లాథ‌మ్ ఓపెన‌ర్లుగా దిగారు. అయితే, క్రీజులోకి వ‌చ్చీ రాగానే భార‌త బౌల‌ర్ ఉమేష్ బంతికి గుప్తిల్ వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో లాథ‌మ్‌, కానే ఉన్నారు.

  • Loading...

More Telugu News