: ఎల్సీడీ స్క్రీన్ శుభలేఖ ఆలోచన సాయికుమార్ దట!


ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహ శుభలేఖ అంశం కూడా ఉంది. గతంలో ఎవరూ చేయని విధంగా వినూత్న ఆలోచనతో, ఎల్సీడీ స్క్రీన్, చిన్న వీడియో మెసేజ్ తో వచ్చిన ఈ శుభలేఖ రూపకర్త ఎవరో తెలుసా? డైలాగ్ కింగ్, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ అట. ఆయనే స్వయంగా చలన చిత్ర సాంకేతిక నిపుణులతో కలసి ఐదు రోజుల పాటు కష్టపడి, పాట రూపంలో వచ్చే వీడియో శుభలేఖను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఎల్సీడీ స్క్రీన్, ప్రింటెడ్ శుభలేఖల కోసం ప్రత్యేక బాక్స్ ను దగ్గరుండి డిజైన్ చేయించారట. ఈ బాక్స్ ను తెరవగానే, స్క్రీన్ ఆన్ కావడం, ఆపై వీడియో ప్లే అవుతూ అందరినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News