: జమ్ముకశ్మీర్ భారత్ లో అంతర్భాగమే!: భారత్ కు మద్దతు పలికిన అల్జీరియా
కశ్మీర్ అంశంలో భారత్ కు మరో దేశం నుంచి మద్దతు లభించింది. జమ్ముకశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా స్పష్టం చేసింది. కశ్మీర్ లో అన్ని రకాల ఉగ్రవాద చర్యలను నిర్మూలించాల్సిన అవసరం భారత్ కు ఉందని తెలిపింది. రెండు రోజుల అల్జీరియా పర్యటనకు భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని అబ్దెల్ మాలిక్ సెల్లాల్ ఉగ్రవాదంపై మాట్లాడుతూ, కశ్మీర్ అంశంలో భారత్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.