: కేసీఆర్ జీవిత చరిత్రతో సినిమా.. మధుర శ్రీధర్ దర్శకత్వం!


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు మధుర శ్రీధర్ దర్శకత్వం వహించనున్నారు. రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే జూన్ 2న సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. కేసీఆర్ జన్మదినం సందర్భంగా 2018 ఫిబ్రవరి 17న ఈ సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు మధుర శ్రీధర్ వెల్లడించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, టీఆర్ఎస్ పార్టీని పెట్టడం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం, తెలంగాణ సాధన, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, బంగారు తెలంగాణ తదితర అంశాలన్నీ సినిమాలో ఉంటాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News