: చెన్నై అపోలో ఆసుప‌త్రి నుంచి స్వదేశానికి తిరిగివెళ్లిన లండన్ వైద్యుడు రిచర్డ్


గ‌త నెల 22 వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కోలుకుంటున్న‌ట్లు అన్నాడీఎంకే తెలిపింది. ఆమెకు చికిత్స అందించ‌డానికి లండ‌న్ నుంచి వ‌చ్చిన ప్ర‌ముఖ వైద్యుడు రిచర్డ్ స్వదేశానికి బ‌య‌లుదేరారు. సింగపూర్ నుంచి అపోలో ఆసుప‌త్రికి వచ్చిన ఫిజియోథెరపీ నిపుణులు అందిస్తున్న చికిత్సకు తమిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్పందిస్తున్నార‌ని అన్నాడీఎంకే పేర్కొంది. మ‌రోవైపు ఎయిమ్స్ వైద్యులు కూడా అపోలో నుంచి ఢిల్లీకి తిరిగివెళ్లారు. ప్ర‌స్తుతం డాక్ట‌ర్‌ రిచర్డ్ చేసిన‌ సూచనల మేరకు సింగపూర్ ఫిజియోథెరపీ నిపుణులు జ‌య‌ల‌లిత‌కు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జయలలిత ఆరోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంత‌ర‌క‌ర‌ పోస్టులు చేసిన ఆరోపణపై మ‌రో వ్య‌క్తి అరెస్ట‌య్యాడు. తంజావూరుకి చెందిన సహాయం అనే వ్యక్తిని తాము అరెస్టు చేసిన‌ట్లు త‌మిళ‌నాడు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News