: 'గాలి'వారింటికి షారూక్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్!


పెళ్లి శుభలేఖతోనే జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన గాలి జనార్దన్ రెడ్డి, తన కుమార్తె వివాహాన్ని నభూతో నభవిష్యతి అనే రీతిలో జరిపేందుకు అన్ని ఏర్పాట్లనూ చేసుకుంటున్న వేళ, ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎంతో మంది స్టార్లు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. తన కుమార్తె వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, గాలి జనార్దన్ రెడ్డి అతిరథ మహారథులకు ఆహ్వానాలు పంపారు. కాగా, ఈ పెళ్లికి హీరోలు షారూక్ ఖాన్‌, మహేష్ బాబు, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ తదితరులు రానున్నట్టు గాలి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు రానున్నారని, పెళ్లికి తరలే వారి కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రైళ్లను బుక్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పెళ్లి వేడుకల ఏర్పాట్లలో బిజీగా గడుపుతున్న గాలి, ఈ వివాహానికి వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News