: మరో ఘనత సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్
ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అలిస్టర్ కుక్ మరో ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ రోజు చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో కుక్ ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో, 133 టెస్టులు ఆడిన అలెక్ స్టివర్ట్ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే, 31 ఏళ్లకే కుక్ ఈ ఘనతను సాధించడం గమనార్హం. అంతేకాదు, ఇంగ్లండ్ జట్టు తరపున టెస్టుల్లో 10వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు కూడా అతనే. 29 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలతో ఇప్పటివరకు 10,603 పరుగులు చేశాడు. అత్యధిక టెస్టులు ఆడిన వారిలో సచిన్ (200) తొలి స్థానంలో ఉండగా... ఆ తర్వాతి స్థానాల్లో పాంటింగ్, స్టీవ్ వా ఉన్నారు. ఈ జాబితాలో కుక్ 11వ స్థానంలో ఉన్నాడు.