: 6 జీబీ ర్యామ్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఆకర్షిస్తున్న ఒప్పో నయా స్మార్ట్ ఫోన్


ఇప్పటికే పలు విజయవంతమైన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టిన చైనా సంస్థ ఒప్పో, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఉన్న మరో రెండు ఫోన్లను విడుదల చేసింది. ఆర్9 ఎస్, ఆర్9 ఎస్ ప్లస్ పేరిట రెండు వేరియంట్లు విడుదల కాగా, ఆర్9 ఎస్ ప్లస్ లో 6 జీబీ ర్యామ్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం గమనార్హం. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి మద్దతిచ్చే 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో 5 నిమిషాల చార్జింగ్ తోనే 2 గంటల టాక్ టైం లభిస్తుందని సంస్థ తెలిపింది. 6 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1.9 జీహెచ్ స్నాప్ డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ వీఓ ఎల్టీఈ ఫీచర్లతో ఇది లభిస్తుంది. ఆర్9 ఎస్ వేరియంట్ లో 4 జీబీ ర్యామ్, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. మిగతా ఫీచర్లన్నీ ఆర్9 ఎస్ లో ఉన్నవే ఉంటాయి. ఇక వీటి ధరలు రూ. 27,700 (ఆర్9 ఎస్), రూ. 34,700 (ఆర్9 ఎస్ ప్లస్) వరకూ ఉంటాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News