: మా నాన్న గెలుపు ఖాయం: ఇవాంకా ట్రంప్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన తండ్రి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దే విజయమని ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ (34) విశ్వాసం వ్యక్తం చేశారు. న్యూయార్క్ లో ఆమె మాట్లాడుతూ, నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటర్ల తీర్పును శిరసావహిస్తారని అన్నారు. తన తండ్రి గెలిచినా, గెలవకున్నా ఎన్నికల ఫలితాన్ని అంగీకరిస్తారని ఆమె తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తన తండ్రిదే గెలుపు కనుక మిగతా ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడాలనుకోవడం లేదని ఆమె చెప్పారు. తన తండ్రి ఎప్పుడూ కరెక్టుగా ఉంటారని ఆమె తెలిపారు. తన తండ్రి గురించి మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆయన తమ అభిప్రాయాలు తీసుకుంటారని అన్నారు. తన తండ్రి ప్రచారంలో తాను కీలకంగా వ్యవహరించడం లేదని ఆమె అన్నారు. కాగా, ఆమె ట్రంప్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News