: శిల్పాశెట్టితో కలిసి చిందేసిన రాందేవ్ బాబా


ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా డాన్సర్ అవతారమెత్తారు. సూపర్ డాన్సర్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆయన పిల్లల ప్రదర్శనకు ముగ్ధుడయ్యారు. స్పెషల్ గెస్టుగా హాజరు కావడంతో వారందర్నీ ఉత్సాహపరిచిన రాందేవ్ బాబా, వారితో కలిసి డాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, దర్శకుడు అనురాగ్ బసు, కొరియోగ్రాఫర్ గీతా కపూర్ కూడా రాందేవ్ బాబాతో కాలు కదపడం విశేషం. గతంలో పలు సందర్భాల్లో తన నాట్యప్రావీణ్యం చూపిన రాందేవ్ బాబా మరోసారి నృత్యం చేయడం అందర్నీ ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News