: విశాఖ ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
విశాఖపట్టణం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అప్పుడే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 'ఆంధ్రా ఊటీ' అరకులో చలిపులి ప్రతాపం చూపుతోంది. దీంతో 'ఆంధ్రా సిమ్లా'గా పేరుగాంచిన లంబసింగిలో 11 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇదే సమయంలో చింతపల్లిలో 14 డిగ్రీలు, మినుములూరులో 15 డిగ్రీలు, పాడేరులో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం విశేషం. సాధారణంగా విశాఖ ఏజెన్సీతోపాటు తెలంగాణ ఏజెన్సీలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాలి. కానీ దీనికి భిన్నంగా ఏపీలో చలి వణికిస్తుండగా, తెలంగాణలో వేడి కాకపుట్టిస్తోంది.