: తూర్పు మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడి గత రాత్రి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కదులుతోందని తెలిపింది. దీంతో రాగల రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారితే ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతు పవనాలు మరో నాలుగు రోజుల్లో దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోనున్నాయని, ఇలాంటి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది.