: ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో హౌస్ సర్జన్ ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో హౌస్ సర్జన్ భలభద్ర రితేష్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. రితేష్ కాకినాడకు చెందిన వెంకటరాజు కుమారుడిగా గుర్తించారు. హాస్టల్ లోని మూడో అంతస్తు నుంచి కిందికి దూకిన రితేష్ ప్రాణాలు కోల్పోయాడు. విగత జీవిగా పడివున్న రితేష్ ను సహవిద్యార్థులు గుర్తించి హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించగా, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఏలూరు ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. రితేష్ బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.