: బాహుబలి-2 తరువాత అనుష్క పెళ్లి?


ప్రముఖ సినీనటి అనుష్క షెట్టి పెళ్లిపై ఊహాగానాలు ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. డిసెంబర్ లో ఆమె నటించిన సింగం-3 విడుదల కానుండగా, 2017 ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కానుంది. ఈ సినిమా తరువాత అనుష్క మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం లేదని, అందుకే ఆమె కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే ప్రచారం జోరందుకుంది. 'అరుంధతి' నుంచి స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న అనుష్క టాలీవుడ్, కోలీవుడ్ లో అగ్రనటిగా కొనసాగుతోంది. కెరీర్ ఆరంభం నుంచి కొన్ని గాసిప్స్ వచ్చినప్పటికీ తొట్రుపడకుండా కెరీర్ ను గాడినపెట్టుకున్న అనుష్క, హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాపారవేత్త ఎవరన్నది పూర్తిగా వెల్లడి కానప్పటికీ, అనుష్క షెట్టి కుటుంబం కూడా వారి బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. దీనిపై త్వరలో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం.

  • Loading...

More Telugu News