: తొలి ప్రత్యర్థి జపాన్...ఆసియా కప్ హాకీ తొలి మ్యాచ్ నేడే


మలేసియాలో నేడు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్‌ గా బరిలోకి దిగనుంది. భారత్‌, పాకిస్థాన్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియాతోపాటు ఆతిథ్య మలేసియా జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. 2011లో చైనాలో జరిగిన తొలి అంచె పోటీల్లో టైటిల్‌ నెగ్గిన భారత్‌ పై ఈ టోర్నీలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. నేడు జరగనున్న తొలి మ్యాచ్ లో భారత్, జపాన్ తో తలపడనుంది. కాగా, ఈ టోర్నీ ఈ నెల 30 వరకు జరగనుంది. భారత్ తో ఎప్పుడు తలపడదామా? అని ఎంతగానో ఎదురు చూసే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్‌ ఆదివారం తలపడనుంది.

  • Loading...

More Telugu News