: ఆ భారం మనమెందుకు భరించాలి?...ఫైనల్ డిబేట్ లో ట్రంప్ ఆగ్రహం


జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియాలకు మనం ఎందుకు మద్దతుగా నిలవాలని అమెరికా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో నిర్వహించిన ఫైనల్ ప్రెసిడెన్షియల్ డిబేట్ లో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ తలపడ్డారు. తమ వాదనను ఆ దేశ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అమెరికా రక్షణ ఒప్పందాలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రపంచ దేశాలతో, ప్రధానంగా దక్షిణ కొరియా, జపాన్, సౌదీ అరేబియా దేశాలతో గతంలో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలను సమీక్షిస్తానని అన్నారు. ఆ దేశాలు భరించాల్సిన భారాన్ని సైనిక శక్తిని మోహరించడం ద్వారా అమెరికా భరిస్తోందని, దానిని సమీక్షిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

  • Loading...

More Telugu News