: నోబెల్ బహుమతి నాకు ఎందుకిచ్చారో తెలియదు: బరాక్ ఒబామా
2009లో నోబెల్ శాంతి బహుమతిని తనకు ఎందుకిచ్చారో ఇప్పటికీ తెలీదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (55) అన్నారు. వచ్చే ఏడాది పదవీ కాలం పూర్తి కావడంతో శ్వేత సౌధాన్ని ఆయన వీడనున్నారు. ఈ నేపథ్యంలో ‘ద లేట్ షో’ అనే టీవీ షోలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగానికి వచ్చిన ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసే రీతిలో ఈ కార్యక్రమం సాగింది. దీంతో ఇంటర్వ్యూయర్ ఒబమాను మీకు నోబెల్ శాంతి పురస్కారం ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. దానికి సమాధానం తనకు తెలియదని ఒబామా పేర్కొన్నారు. కాగా, ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడు కాగా, 2009లో ఆయనను నోబెల్ శాంతిపురస్కారం వరించింది.