: మరో వివాదం రేపిన రాధేమా!


వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త, తనను తాను దేవతగా చెప్పుకునే రాధేమా మరో వివాదం రేపారు. హరిద్వార్‌ లో పవిత్ర గంగానదిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాధేమా, కాలికి బూట్లు ధరించింది. పవిత్ర గంగానదిలో కాలికి బూట్లు ధరించి రాధేమా దిగడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ తతంగం మొత్తాన్ని షూట్ చేసి దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయిన ఈ వీడియోను చూసి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ముంబైకి చెందిన రాధేమాపై వరకట్న వేధింపులతో పాటు, పొట్టిడ్రెస్ లు ధరిస్తుందని, అసభ్య నృత్యాల వంటివి చేస్తుందని పలు ఆరోపణలున్నాయి. ఆమెపై ముంబైకి చెందిన ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

  • Loading...

More Telugu News