: సంక్షేమం అంటే ఎన్టీఆర్... అభివృద్ధి అంటే చంద్రబాబు: రేవంత్ రెడ్డి


'సంక్షేమం అంటే ఎన్టీఆర్... అభివృద్ధి అంటే చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్' అని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ భవన్ అంటే నాయకులను అందించే యూనివర్శిటీ అని, ఈ యూనివర్శిటీ దేశానికి ఎంతో మంది నేతలను అందించిందని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు ఒక సంస్థలా టీడీపీ పనిచేస్తోందని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అమరావతిని అద్భుతమైన, ప్రసిద్ధ నగరంగా తీర్చిదిద్దే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని రేవంత్ అన్నారు.

  • Loading...

More Telugu News