: ‘బాహుబలి 2’ ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది... ప్రకటించిన రాజమౌళి


‘బాహుబలి 2’ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం కుదిరింది. తెలుగు సినీ పరిశ్రమ కీర్తి ప్రతిష్ఠలు పెంచిన ‘బాహుబలి’కి కొనసాగింపుగా తీస్తున్న ‘బాహుబలి 2’ ఫస్ట్ లుక్ ను ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేస్తానని దర్శకుడు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజైన అక్టోబరు 22న ముంబయి ఫిలిం ఫెస్టివల్‌ లో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించామని ఈ సినిమా దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ‘బాహుబలి 2’లో ప్రభాస్‌, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2017 ఏప్రిల్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా థియేటరికల్‌, శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తంలో అమ్ముడైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News