: భారత్ కు చెందిన వార్తలపై పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా సంపూర్ణ నిషేధం!
భారత్ కు చెందిన ఏ విషయాన్ని ఇకపై తమ దేశంలో ప్రసారం చేయమని, సంపూర్ణ నిషేధం విధిస్తామని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒక ఆంగ్ల పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం, భారత్ కు చెందిన వార్తలు, సినిమాలు, టెలివిజన్, రేడియో కార్యక్రమాలను ప్రసారం కానివ్వమని, పూర్తిగా నిషేధం విధిస్తామని, ఈ నిషేధం అక్టోబర్ 21 నుంచి అమల్లోకి వస్తుందని పీఈఎంఆర్ఏ పేర్కొన్నట్లు ఆ కథనంలో రాసింది. భారత్ కు సంబంధించిన ఏ అంశం ప్రసారం చేసినా స్థానిక ఛానెళ్లపై నిషేధం విధిస్తామని పీఈఎంఆర్ఏ హెచ్చరించిందని ఆ కథనంలో పేర్కొంది.