: మా ఇంట్లో దయ్యాలు ఫోన్లు మాట్లాడుతున్నాయి...!: పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
దయ్యాలు ఫోన్లలో మాట్లాడుకుంటున్నాయని ఎవరికైనా చెబితే పిచ్చిపట్టిందా? దయ్యాలు ఫోన్లలో మాట్లాడుకోవడమేంటి? అని అడుగుతారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కి చెందిన మమత అనే మహిళ మాత్రం పోలీస్ స్టేషన్ కు వెళ్లి, తమ ఆస్తిపై కన్నేసిన పక్కింటి వాళ్లు తమ ఇంట్లోకి దయ్యాలను వదులుతున్నారని ఫిర్యాదు చేసింది. వాళ్లు వదిలిన దయ్యాలు తమ ఇంట్లో ఫోన్లలో మాట్లాడుకుంటున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా టీవీ చూస్తున్నప్పుడు తెరపై కనిపించే మనుషులు ఉన్నట్టుండి కళ్ల ముందు ప్రత్యక్షమై దయ్యాలుగా మారిపోతున్నారని అందులో వెల్లడించింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన గ్వాలియర్ డీఎస్పీ ఆలం ఖాన్ దర్యాప్తు చేస్తామని ఆమెకు హామీ ఇచ్చి పంపించారు.