: మన జవాన్లను చంపేస్తుంటే..పాక్ తో క్రికెట్ సిరీస్ లా?: మాజీ కెప్టెన్ గంగూలీ
పాకిస్థాన్ విషయమై టీమిండియా క్రికెటర్ గంభీర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ కెప్టెన్ గంగూలీ మద్దతు పలికాడు. పాకిస్థాన్ తో కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడకుండా ఉండటం మంచిదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, మన జవాన్లను చంపేస్తుంటే, పాక్ తో క్రికెట్ సిరీస్ లు ఆడటం ఎంత వరకు సబబు? అని గంగూలీ ప్రశ్నించాడు. కాగా, పాకిస్థాన్ చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే, మనదేశంలో ఉన్న పాక్ నటీనటులను ఆదరించకూడదని, ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ లకు కొంత విరామం ఇవ్వాలని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.