: శ్రుతి హాసన్ చాలా రొమాంటిక్ అట!
తాను చాలా 'రొమాంటిక్' అని శ్రుతి హాసన్ తనకు తాను కితాబు ఇచ్చుకుంది. హిందీ టీవీ ఛానెల్ నిర్వహించిన 'దీవాలీ మస్తీ' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, సినీ ప్రేక్షకులు మాత్రం తనను రాకర్ గా భావిస్తారని తెలిపింది. అయితే తాను రొమాంటిక్ గా ఉండేందుకు కొంత స్ఫూర్తి కావాలని చెప్పింది. అవతలి వాళ్లు మరీ సిల్లీ ఫెలో అయితే రొమాంటిగ్గా ఉండలేనని చెప్పింది. అభిమానులు మాత్రం రాక్ సంగీత కార్యక్రమాల్లో పాల్గొనాలని అనుకుంటారని చెప్పింది. తనకు 'బాడీగార్డ్' సినిమాలోని ఐలవ్యూ పాట అంటే చాలా ఇష్టమని, అందులో కొంత అమాయకత్వం, సరదా కూడా ఉంటాయని ఆమె తెలిపింది. ఇమ్రాన్ హష్మీతో 'దిల్ తో బచ్చాహై జీ'లో నటించేందుకు మొదట్లో చాలా భయపడ్డానని, అతను చాలా అద్భుతమైన నటుడని, అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని చెప్పింది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ చాలా క్రమశిక్షణతో స్పూర్తిమంతంగా కనిపిస్తారని చెప్పింది. జీవితం పట్ల ఆయన చూపే దృక్పథం ఆశ్చర్యకరమని తెలిపింది. 'గబ్బర్ ఈజ్ బ్యాక్'లో ఆయనతో కలిసి నటించడం మర్చిపోలేనని తెలిపింది.