: హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహంపై మండిపడుతున్న మహిళలు


అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాన్ని ఇటీవల న్యూయార్క్ వీధుల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై అభిమానులు, ప్రజలు అంతగా స్పందించకపోగా, ఆ విగ్రహం దగ్గర నిలబడి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. తాజాగా, డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహం ఒకటి న్యూయార్క్ వీధుల్లో దర్శన మిచ్చింది. మాన్ హటన్ లోని సబ్ వే స్టేషన్ బయట హిల్లరీ టాప్ లెస్ విగ్రహాన్ని ఎవరో ఉంచారు. ఈ విగ్రహాన్ని చూసిన వెంటనే ఒక మహిళ దానిని కిందపడేసింది. ఈ విగ్రహాన్ని మళ్లీ అక్కడ ఉంచకూడదనే ఉద్దేశ్యంతో కింద పడేసిన దానిపై ఎక్కి కూర్చుంది. అయితే, ఇదంతా కళ్లకు కట్టినట్లుగా న్యూయార్క్ డైలీ రిపోర్టర్ చిత్రీకరించారు. కాగా, ఈ విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారనే విషయం తెలియలేదు. హిల్లరీ నగ్న విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై న్యూయార్క్ మేయర్ బిల్ బ్లాసియో, హిల్లరీ క్లింటన్ వర్గాలు మాత్రం స్పందించలేదు.

  • Loading...

More Telugu News