: కంటైనర్ లో అపస్మారక స్థితిలో యువకుడు... వైజాగ్ లో కలకలం!


విశాఖపట్టణంలోని పోర్టు కంటైనర్ టెర్మినల్‌ లో కలకలం రేగింది. కంటైనర్‌ లను అప్‌ లోడ్ చేసే సమయంలో ఒక కంటైనర్‌ లో యువకుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో పోర్టు అధికారులు ఆ యువకుడిని హుటాహుటీన కేజీహెచ్‌ కు తరలించారు. చికిత్స చేసిన అనంతరం ఆ యువకుడు కోలుకుంటున్న క్రమంలో మాయమయ్యాడు. అయితే ఆ యువకుడి పేరు రోహన్ అని, బంగ్లాదేశ్ కు చెందినవాడని తెలుస్తోంది. కంటైనర్ లో 13 రోజులుగా ఉన్నాడని, ఆహారం, గాలి లేకపోయినా బతికిబట్టకట్టడం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ... రోహన్ ఎవరు? ఎందుకు కంటైనర్ లో దాక్కున్నాడు? కంటైనర్ లో ఏముంది? ఈ కంటైనర్ ఏ దేశం నుంచి విశాఖకు వచ్చింది? ఇలా చాలా ప్రశ్నలు స్థానికులను వేధిస్తున్నాయి. అతనిని అధికారులే విచారణ కోసం తరలించారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News