: యూపీలో డ్యాన్సర్ల పైకి డబ్బులు విసిరిన ఎమ్మెల్యే.. మండిపడుతున్న ప్రతిపక్షాలు
ఉత్తరప్రదేశ్ లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగత్ రామ్ పాసవన్ ఒక పెళ్లి వేడుకలో డ్యాన్సర్లపైకి డబ్బులు వెదజల్లుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి చేరి హల్ చల్ చేస్తోంది. ఈ సంఘటనపై అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓపక్క సమాజ్ వాదీ పార్టీ అంతర్గత సమస్యలతో సతమతమవుతుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోపక్క ఇలాంటి పనులు చేస్తూ ఆనందిస్తున్నారంటూ విమర్శించారు. అయితే, ఈ సంఘటనపై స్పందించిన ఆ పార్టీ నేత ఒకరు మాట్లాడుతూ, విచారణ చేపట్టామని, వాస్తవాలు తెలిసిన తర్వాత ఆ ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.