: అందమైన జీవితాన్ని పరిచయం చేస్తానంటున్న 'డియర్ జిందగీ'


శ్రీదేవి నటించిన 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' చిత్రం దర్శకురాలు గౌరీ షిండే ఈసారి అందమైన జీవితాన్ని పరిచయం చేస్తానంటోంది. కాంక్రీట్ జంగిల్ లో ఉద్యోగం, పని ఒత్తిడి, జీవన ఒత్తిళ్లతో విసిగిపోయారా? అయితే మీకు సరికొత్త జీవితాన్ని పరిచయం చేసి 'డియర్‌ జిందగీ' అనిపిస్తానని ఆమె చెబుతోంది. షారుఖ్‌ ఖాన్‌, అలియా భట్ అరుదైన కాంబినేషన్‌ లో మరోసారి లేడీ ఒరియంటెడ్‌ సినిమాగా 'డియర్‌ జిందగీ'ని ఆమె తెరకెక్కించింది. ఈ సినిమాలో లొకేషన్ల దగ్గర్నుంచి, పాత్రల వరకు అన్నీ సరికొత్తగా ఉంటాయని గౌరీ షిండే చెబుతోంది. ఈ సినిమా తొలి టీజర్ ను విడుదల చేసిన గౌరీ షిండే... ఈ టీజర్ లో అలియా భట్ ప్రశ్నలు అడిగే అమ్మాయిగా, షారుఖ్‌ సమాధానాలు చెప్పే వ్యక్తిగా కనిపిస్తారు. సముద్రంతో కబడ్డీ ఆడుదామా? అంటూ ప్రారంభమయ్యే ఈ టీజర్ షారూఖ్, అలియా అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఆ టీజర్ చూడిండి.

  • Loading...

More Telugu News