: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోపై దాడి
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు తీవ్ర అవమానం జరిగింది. గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన పశ్చిమబెంగాల్ లోని అసన్ సోల్ ప్రాంతానికి కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో కేంద్ర మంత్రికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు దిగారు. కేంద్ర మంత్రి కారుపై రాళ్ల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయగా, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడులకు దిగారు. కేంద్ర మంత్రి కారును ధ్వంసం చేశారు. బీజేపీ కార్యకర్తలను చితక్కొట్టారు. పోలీసుల సాక్షిగా ఈ దాడులు జరగడం విశేషం. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.