: కశ్మీర్‌లో భారీగా పాక్, చైనా జెండాలు.. 100 మంది ఆందోళనకారుల అరెస్ట్


జమ్మూకశ్మీర్‌లో అల్ల‌రి మూక‌ల ఆగ‌డాల‌కు చెక్ పెట్టేందుకు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఈ రోజు సోదాలు చేశారు. రాష్ట్రంలోని ప‌లు చోట్ల జ‌రిపిన ఈ సోదాల్లో 100 మంది ఆందోళ‌న‌కారుల‌ను అరెస్టు చేశారు. అరెస్ట‌యిన వారంతా ఉగ్ర‌వాద సంస్థ‌ల సంస్థల సానుభూతిపరులుగా అనుమానిస్తున్నారు. జైషే మహ్మద్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ‌ల‌కు వీరు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లు తెలుస్తోంది. వారి వద్ద పాకిస్థాన్, చైనా జెండాలు భారీగా క‌నిపించాయి. వాటిని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంఖ్య‌లో పాక్ జెండాలు క‌నిపించ‌డం ప‌ట్ల‌ ఆర్మీ అధికారులు సైతం విస్మ‌యం చెందారు.

  • Loading...

More Telugu News