: కావేరి జలాల అంశంపై తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కావేరీ నదీ జలాల వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు మరోసారి ఇరు పక్షాల వాదనలు వింది. అనంతరం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తమిళనాడు, కేరళ అప్పీలుపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. నిన్న జారీ చేసిన ఆదేశాల మేరకే తమిళనాడుకు కర్ణాటక రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున కావేరీ జలాలను విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమిళనాడులో ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి.