: రేపటి నుంచి కాంగ్రెస్ నిరసనలు... ఉద్యమ కార్యాచరణపై హైదరాబాద్‌లో టీపీసీసీ నేతల భేటీ
తెలంగాణ ప్రభుత్వం తీరుపట్ల నిరసనలు తెలపడానికి టీపీసీసీ సిద్ధమైంది. అందుకోసం రూపొందించుకున్న ప్రణాళికను అమలు పర్చడానికి ఈరోజు హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశమైంది. టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, జానారెడ్డి, మల్లు, డీకే అరుణ దీనికి హాజరయ్యారు. ఆందోళనలో పాల్గొనే అంశాలపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ రేపు మహబూబాబాద్‌లో రైతు గర్జన పేరుతో సభ నిర్వహించనుంది. ఈ సందర్భంగా రైతుల నుంచి రుణమాఫీ దరఖాస్తులను తీసుకోనుంది. దరఖాస్తుల ఉద్యమాన్ని నెల రోజుల పాటు కొనసాగిస్తుంది. ఎల్లుండి తెలంగాణలోని అన్ని కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మరో దరఖాస్తు ఉద్యమం ప్రారంభించనుంది. వచ్చే నెల 30 వరకు ఆందోళనలు కొనసాగించనుంది. అనంతరం డిసెంబర్ 2న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు.