: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో కొత్త జిల్లాలు, మండలాలు, డివిజన్ల ఏర్పాటుతో కొత్త పోస్టులు మంజూరు


తెలంగాణ రాష్ట్రంలో ద‌స‌రా నుంచి కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజ‌న్ల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక శాఖ‌ కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ శాఖ‌లో కొత్త‌గా 2109 పోస్టులు మంజూరు చేసింది. వాటిల్లో క‌లెక్ట‌రేట్ల‌కు 693, రెవెన్యూ డివిజ‌న్లకు 188 పోస్టులు మంజూరు చేస్తున్న‌ట్లు పేర్కొంది. ఇక, మండలాలకు 1228 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాటిల్లో మండ‌ల స‌ర్వేయ‌ర్లు, ఆఫీస్ స‌బార్డినేట‌ర్లు, మండ‌ల ప్లానింగ్, స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్స్, త‌హ‌శీల్దార్‌, డిప్యూటీ త‌హ‌శీల్దార్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్ట‌ర్లు, సీనియ‌ర్ అసిస్టెంట్లు, జూనియ‌ర్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News