: తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది.. హైదరాబాద్ నగరంలో రహదారులు దారుణంగా మారాయి: కేంద్రమంత్రి దత్తాత్రేయ
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర నేత బండారు దత్తాత్రేయ విమర్శలు గుప్పించారు. ఈ రోజు సికింద్రాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు ప్రచారం చేసుకోవడంలోనే మునిగిపోయిందని, ప్రజాసమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని అన్నారు. రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి అంతంతమాత్రమే జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో రహదారులు దారుణంగా మారాయని, వర్షం పడితే ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. మెట్రో నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తోందని చెప్పారు. నగరంలో ట్రాఫిక్‌తో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని చెప్పారు. రెండు పడక గదుల నిర్మాణం జరగడం లేదని అన్నారు.