: నిన్నటి వరకు ఛాయ్ వాలా... ఇప్పుడు మోడల్.. పాక్ కుర్రాడి కథ!


'పాకిస్థాన్ పై భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ కు సమాధానంగా ఈ కుర్రాడు భారత అమ్మాయిలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాడు' అంటూ తమాషా కామెంట్స్ తో, ఓ నీలికళ్ల ఛాయ్ వాలా ఫోటో ఒకటి పాకిస్థాన్ సోషల్ మీడియాలో పాప్యులర్ అయింది. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడా కుర్రాడి జీవితం మారిపోయింది. నిన్నటి వరకు రోడ్డుకు ఓ మూల దుకాణంలో వచ్చీపోయే వారికి ఛాయ్ పోస్తూ తిరిగిన ఆ యువకుడికి ఓ మోడలింగ్ ఏజెన్సీ నుంచి పిలుపు వచ్చింది. ఫిటిన్.పీకే (పాకిస్థాన్) బ్రాండ్ కి ఈ ఛాయ్ వాలా అర్షద్ మోడల్ గా వ్యవహరించనున్నాడు. ఇస్లామాబాద్ కు చెందిన జియా అలీ అనే ఫోటోగ్రాఫర్ కి అర్షద్ ఈమధ్య కనిపించాడు. దీంతో అతని ఫోటో తీసిన ఆమె, ఇన్ స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసి, 'ఇతను చాలా బాగుంటాడు. మోడలింగ్ కి పనికొస్తాడు... ఎవరైనా ఇతనికి అవకాశం ఇవ్వండి' అంటూ పేర్కొంది. దీంతో అర్షద్ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అతని జీవితమే మారిపోయింది. ఇప్పుడక్కడి వారు అతనితో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అతనిని అభిమానించేవారు మరికొన్ని ఫోటోలు పోస్టు చేయమని కోరడంతో, తాజాగా అతను మోడలింగ్ లో దిగిన ఫోటోలు పోస్టు చేశాడు. అవి కూడా పాకిస్థానీలను అలరిస్తున్నాయి.

  • Loading...

More Telugu News