: కన్నీరుమున్నీరైన బాలీవుడ్ నటుడు ఓంపురి!


కాన్పూర్ లో అమర జవాన్ కుటుంబీకులను పరామర్శించిన బాలీవుడ్ నటుడు ఓంపురి కన్నీరు మున్నీరయ్యారు. సైనికులపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన మరోసారి క్షమాపణలు చెప్పారు. ఓంపురి నిన్న తన 66వ పుట్టినరోజు సందర్భంగా బారాముల్లా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాన్ నితిన్ యాదవ్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. కాగా, యూరీ ఘటన అనంతరం ఓంపురి ఒక ఇంటర్వ్యూలో సైనికులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విదితమే. దీంతో విమర్శలు తలెత్తడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.

  • Loading...

More Telugu News