: నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడి.. ఆ వివరాలు ఇవిగో!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను ఈ రోజు మీడియాకు వెల్లడించారు. ఈ రోజు గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలిపిన వివరాల ప్రకారం.. నారా లోకేశ్ ఆస్తుల వివరాలు.. * హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్ వాటాల విలువ రూ.2 కోట్ల 52 లక్షలు * ఇతర కంపెనీల్లోని వాటాల విలువ రూ.కోటి 64 లక్షలు * నారా లోకేశ్ పేరిట ఉన్న కారు విలువ రూ.92 లక్షలు * మొత్తం ఆస్తుల విలువ రూ.14 కోట్ల 50 లక్షలు * అప్పుల విలువ రూ.6 కోట్ల 35 లక్షలు * నికర ఆస్తుల విలువ రూ.8 కోట్ల 15 లక్షలు నారా బ్రాహ్మణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలు.. * మాదాపూర్‌లో బ్రాహ్మణి పేరిట ఉన్న భూమి విలువ రూ.17 లక్షలు * జూబ్లిహిల్స్‌లో బ్రాహ్మణి పేరిట వున్నా ఇంటి విలువ రూ.3 కోట్ల 50 లక్షలు * చెన్నయ్ లో ఉన్న వాణిజ్య స్థలం విలువ రూ.48 లక్షలు * మణికొండలో ఉన్న స్థలం విలువ రూ.కోటి 23 లక్షలు * హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాల విలువ రూ.78 లక్షలు * ఆభరణాల విలువ రూ.15 లక్షలు * పీఎఫ్ ఖాతా విలువ రూ.19లక్షలు * ఖాతాలోని నగదు నిల్వ రూ.25 లక్షలు * బ్రాహ్మణి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ.12 కోట్ల 75 లక్షలు * అప్పులు రూ.42 లక్షలు * నికర ఆస్తులు రూ.12 కోట్ల 33లక్షలు దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల వివరాలు.. * జూబ్లిహిల్స్‌లోని దేవాన్ష్ పేరిట ఉన్న ఇంటి విలువ రూ. 9 కోట్ల 17 లక్షలు * పిక్స్‌డ్ డిపాజిట్లు రూ.2 కోట్ల 4లక్షలు * దేవాన్ష్ ఖాతాలోని నగదు నిల్వ రూ.2 లక్షల 31 వేలు * దేవాన్ష్ పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.11 కోట్ల 23.31 లక్షలు.